ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు- లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండటంతో ఈ ఘటన జరిగింది.

ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని పోలీసులు నల్గొండ, నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు.