
న్యూఢిల్లీ:
బంగారం, వజ్రాల రిటైలర్ అకేరా ఆర్కిడ్ పేరుతో డైమండ్ నగల కలెక్షన్ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా పూల ఆకారంలో కట్ చేసిన సోలిటేర్ డైమండ్ అని కంపెనీ తెలిపింది. 300కు పైగా ఫ్యాసెట్‌లు ఉన్న ఈ వజ్రాన్ని మెరిసేలా డిజైన్ చేశామని వివరించింది.
ప్రతి ఆర్కిడ్ సోలిటేర్ వజ్రంపై అకేరా లోగోను లేజర్ ద్వారా చెక్కారు. దీనికి ప్రత్యేకమైన ఐజీఐ సర్టిఫికెట్ కూడా ఉంటుంది. ఆర్కిడ్ ప్రచారం కోసం నటి తాప్సీ పన్నును నియమించుకున్నట్టు అకేరా తెలిపింది. అకేరా వినూత్నంగా ఆలోచిస్తుందని, నాణ్యతలో రాజీపడదని తాప్సీ చెప్పారు. ఈ ఆర్కిడ్ కేవలం ఆభరణం మాత్రమే కాదని, ఇది ఒక ఆవిష్కరణ అని అన్నారు.
ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐజీఐ) ఎండీ, సీఈఓ తెహ్మాస్ప్ ప్రింటర్ మాట్లాడుతూ, అకేరా ఆర్కిడ్ వజ్రాల పరిశ్రమలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తుందని ప్రశంసించారు. అకేరా ఆర్కిడ్ జ్యువెలరీ సేకరణలో ఉంగరాలు, చెవిపోగులు, పెండెంట్లు, బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్ సెట్స్, మాంగ్ టీకా ఉన్నాయి.