
హసన్పర్తి, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్లో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన బుర్ర రాకేశ్ అలియాస్ యుగేంద్ర అలియాస్ వివేక్ చనిపోయాడు. ఆయన కేశవరావు కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసేవాడని తెలిసింది.
గ్రామంలోని స్కూల్లో 2008లో పదో తరగతి చదివిన రాకేశ్ ఇంటర్, డిగ్రీ, పీజీ హనుమకొండలోని ప్రైవేట్ కాలేజీల్లో చదివాడు. పెండ్లి చేసుకోకుండా బంధువుల సాయంతో 2016లో దళంలో చేరాడు. తొమ్మిదేండ్లుగా దళంలో కొనసాగుతున్న ఆయన చనిపోయినట్లు తెలవడంతో చింతగట్టు గ్రామంలో విషాదం నెలకొంది.