OTT MOVIES..మాస్ ఆడియెన్స్ కోసం.. స్ట్రీమ్ ఎంగేజ్

OTT MOVIES..మాస్ ఆడియెన్స్ కోసం.. స్ట్రీమ్ ఎంగేజ్

టైటిల్ : ఘోస్ట్

కాస్ట్ : శివ రాజ్​కుమార్, ఎమ్​జీ శ్రీనివాస్, అర్చన జోయిస్, జయరాం, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ 
OTT MOVIES..మాస్ ఆడియెన్స్ కోసం.. స్ట్రీమ్ ఎంగేజ్ ఎమ్​జీ శ్రీనివాస్
లాంగ్వేజ్ : కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, ప్లాట్​ఫాం : జీ5


వామన్ శ్రీనివాసన్ (ప్రశాంత్ నారాయణన్) ఒక మాజీ సీబీఐ ఆఫీసర్. కర్నాటక సెంట్రల్​ జైలు ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వ అనుమతి కోసం పదేండ్లు పోరాడి... సాధిస్తాడు. తర్వాత భూమి పూజ కోసం ఆ జైలుకు వెళ్తాడు వామన్. వామన్​, తన టీం కిడ్నాప్​కి గురవుతారు. వాళ్లని అదే జైల్లో బంధిస్తారు. ఈ కేస్​ డీల్ చేయడానికి గవర్నమెంట్​ స్పెషల్ ఆఫీసర్​గా చరణ్ రాజ్​ (జయరామ్)ని పంపిస్తారు. చరణ్ ఇన్వెస్టిగేషన్​లో వామన్​ని కిడ్నాప్​ చేసింది ఎవరో తెలుస్తుంది. అతని పేరు బిగ్​ డాడీ అని.. అతను చనిపోయి పదేండ్లు అయినట్టు తెలుస్తుంది. మరి ఆ బిగ్ డాడీ ఎవరు? వామన్​ని జైల్లోనే ఎందుకు కిడ్నాప్​ చేయాలనుకున్నాడు? ఏజెన్సీలో ఉన్న పితామహాకు బిగ్ డాడీకి లింక్​ ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇది ఫుల్ మాస్​ యాక్షన్ ఎంటర్​టైనర్​. ఎలివేషన్స్, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ బాగున్నాయి. 

మర్డర్​ కేస్ సాల్వ్​ చేశారా?

టైటిల్ : కన్నూర్ స్క్వాడ్
కాస్ట్ : మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, కిశోర్, 
విజయ రాఘవన్
డైరెక్టర్ : రోబీ వర్గీస్ రాజ్
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ, తమిళం,  ప్లాట్​ఫాం : డిస్నీ ప్లస్ హాట్​స్టార్

కేరళలోని కన్నూర్​లో క్రైమ్​ రేట్​ని తగ్గించడానికి రెండు స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేస్తాడు ఎస్పీ. ఒక్కో టీంలో నలుగురు ఉంటారు. అందులో ఒకటి ఏఎస్సై జార్జ్ మార్టిన్ (మమ్ముట్టి) గ్రూప్​. ఈ గ్రూప్​కి  రాజకీయ నాయకుడి హత్య కేసు ఇన్వెస్టిగేషన్​ బాధ్యత ఇస్తాడు ఎస్పీ. పది రోజుల్లోగా కేసును సాల్వ్​ చేయమని చెప్తాడు. అయితే, ఆ స్క్వాడ్​లోని ఒకరు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వస్తాయి. అయినా సరే ఆ కేసును సాల్వ్ చేసే బాధ్యత వాళ్ల గ్రూప్​కే ఇస్తారు. ఎందుకలా చేశారు? చనిపోయిన వ్యక్తి ఎవరు? అతడ్ని ఎవరు, ఎందుకు చంపారు? ఇచ్చిన టైంలోపే జార్జ్ టీం కేస్​ని సాల్వ్ చేయగలిగిందా? వంటివి తెలియాలంటే కన్నూర్ స్క్వాడ్ చూడాల్సిందే. పని విషయంలో టీం వర్క్​ బాగుంటుంది. ట్విస్ట్​లు, క్లైమాక్స్​ చాలా బాగున్నాయి. స్క్వాడ్​ టీంలో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది.

విమెన్ పవర్

టైటిల్ : సుఖీ
కాస్ట్ : శిల్పాశెట్టి, అమిత్ సాధ్, కుష కపిల, పవ్​లీన్ గుజ్రల్, కిరణ్ కుమార్, వినోద్ నాగ్​పాల్
OTT MOVIES..మాస్ ఆడియెన్స్ కోసం.. స్ట్రీమ్ ఎంగేజ్ సోనల్ జోషి
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ఫాం : నెట్​ ఫ్లిక్స్

సుఖ్​ప్రీత్ కర్లా అలియాస్ సుఖీ (శిల్పాశెట్టి) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన​ పంజాబీ గృహిణి​. నలభై ఏండ్లుగా ఆమె అదే జీవితాన్ని గడుపుతుంటుంది. అయితే టీనేజర్​గా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమె ఎలా ఉండేదో.... తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆమె భర్త గురు (చైతన్య చౌధరీ) ఆమెని చులకనగా చూస్తుంటాడు. వాళ్లకు జెస్సీ (మాహీ జైన్) అనే కూతురు ఉంటుంది. ఒకరోజు సుఖీకి స్కూల్​ రీయూనియన్​ ప్రోగ్రామ్​కి రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. అది చూసి ఆమె తన గతాన్ని గుర్తుకుతెచ్చుకుంటుంది. చదువుల్లో, ఆటల్లో ఆమె ఎంత యాక్టివ్​గా ఉండేదో చూపిస్తారు. మళ్లీ ఆమె తన ఫ్రెండ్స్​ని కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది. అక్కడికి వెళ్లాక ఏం జరిగిందనేదే మిగతా కథ. సుఖీ సామర్థ్యాల గురించి తెలుసుకున్న భర్త మారతాడా? 
రీ యూనియన్ తర్వాత నుంచి సుఖీ లైఫ్ ఎలా ఉంటుంది? అనేవి ఇంట్రెస్టింగ్ అంశాలు. ఇందులో శిల్పాశెట్టి యాక్టింగ్​ చాలా బాగుంది. సెకండాఫ్ నుంచి సినిమా ఇంట్రెస్టింట్​గా ఉంటుంది.