ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం

ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వం

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఆపకపోతే ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనివ్వమని ఓయూ జేఏసీ, దక్షిణ తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ తెలంగాణ నీళ్లను దోచుకుంటున్నారని జేఏసీ నేతలు కల్వకుర్తి ఆంజనేయులు, మాళిగ లింగుస్వామిలు అన్నారు. జేఏసీ తరపున వీరు కేఆర్ఎంబీ చైర్మన్ పరమేశన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 203 జీవోను రద్దు చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి ఓయూ జేఏసీ అల్టిమేటం జారీచేసింది. 203 జీవో వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా దక్షిణ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని వారన్నారు. గోదావరి నీరు ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీరు రాయలసీమకు తరలిస్తే దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు? కేసీఆర్ తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రా? లేకపోతే ఉత్తర తెలంగాణకు మాత్రమే ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి చెంచాలుగా పని చేస్తున్నారని వారన్నారు. నీటి విషయంలో కేసీఆర్ చెప్తున్న మాటలన్నీ అబద్ధమేనని వారన్నారు.

‘టీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా పార్టీ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కూర్చోని నిర్మిస్తానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఎడారి అవుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. కుర్చీ వేసుకొని పాలమూరు ప్రాజెక్ట్ కట్టిస్తన్న కేసీఆర్ ఇప్పుడు ఏడున్నడు. కుర్చీ లేకపోతే కుర్చీ తెచ్చిస్తం.. ప్రాజెక్ట్ కట్టు’అని జేఏసీ నేతలు అన్నారు. పోతిరెడ్డిపాడును దక్షిణ తెలంగాణ నేతలు అడ్డుకొకపోతే.. వారిని బయట తిరగకుండా అడ్డుకుంటామని జేఏసీ నేతలు హెచ్చరించారు. నీళ్ల దోపిడీకి పాల్పడితే ఏపీ సీఎం జగన్‌ను హైదరాబాద్‌లో తిరగనియమని వారన్నారు.

For More News..

వీడియో: మాస్క్ ఏదని అడిగిన పోలీసులపై దాడి చేసిన యువకుడు

ఒకే టీచర్‌ 25 స్కూళ్లలో రిజిష్టర్.. ఏడాదికి కోటి రూపాయలు డ్రా

కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మహిళకు ఫోన్ చేసి..