రాజ్యాంగాన్ని రక్షించడమే మా పార్టీ లక్ష్యం: ఖర్గే

రాజ్యాంగాన్ని రక్షించడమే మా పార్టీ లక్ష్యం: ఖర్గే

జునాగఢ్: రాజ్యాంగాన్ని కాపాడట మే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. గుజరాత్​లో బుధవారం కాంగ్రెస్ జిల్లా, సిటీ అధ్యక్షులకు 10 రోజుల ట్రైనింగ్ క్యాంప్​ను ప్రారంభించే ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోరాడటం అనేది సాధారణం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించడమే మా ప్రధాన లక్ష్యం. గాంధీ, వల్లాభ్ భాయ్​ పటేల్ వంటి గొప్ప వ్యక్తులు ఇక్కడే జన్మించి దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. వారు మనకు అత్యంత గౌరవనీయులు. వారి వల్లే  దేశం ఐక్యం ఉంది. కానీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకోవడం లేదు” అని తెలిపారు.