
కూకట్పల్లి, వెలుగు: డబుల్‌బెడ్ రూమ్ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి, పలువురి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఔట్ సోర్సింగ్ఉద్యోగిని బాలానగర్పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయంలో ఎం. గీత అనే మహిళ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుంది. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.2.5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.