
ఛత్తీస్ ఘడ్ లో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. తుపాకుల మోతతో అడవులు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా బుధవారం ( మే 21 ) గాలింపు ముమ్మరం చేశాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలకు ఎదురుపడ్డారు మావోయిస్టులు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల్లో అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Also Read : మోదీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయింది
ఇటీవల కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగార్ కూడా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.. ఈ ఆపరేషన్ లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ కగార్ తర్వాత జాతీయ జెండాను ఎగురవేసి తమ విజయాన్ని ప్రకటించాయి భద్రతా దళాలు . ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతూ మావోల ఏరివేత సక్సెస్ అయ్యిందని తెలిపారు