ట్రంప్ ర్యాలీలతో 30 వేల మందికి కరోనా, 700 మంది మృతి

ట్రంప్ ర్యాలీలతో 30 వేల మందికి కరోనా, 700 మంది మృతి

న్యూయార్క్: అమెరికాలో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. కామెంట్లు, విమర్శలతో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ హీట్ ఎక్కిస్తున్నారు. దీన్ని పక్కనబెడితే.. ట్రంప్‌‌ ఎన్నికల ప్రచారంతో 30 వేల మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాన్‌‌‌ఫోర్డ్ వెల్లడించిన సర్వే ఫలితాలను బైడెన్ తన ట్విట్టర్ అకౌంట్‌‌లో షేర్ చేశారు. ట్రంప్ ప్రచార ర్యాలీల కారణంగా అమెరికాలో మూడు వారాల్లోనే 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయని బైడెన్ ఆరోపించారు.

ట్రంప్ నిర్వహించిన 18 ఎన్నికల ర్యాలీల కారణంగా 700 మంది ప్రజలు మృత్యువాత పడ్డారని బైడెన్ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం గురించి ప్రెసిడెంట్ ట్రంప్ పట్టించుకోరని, తన సొంత మద్దతుదారులనూ ఆయన లెక్కచేయరంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ ర్యాలీలో చాలా మంది మద్దతుదారులు, ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్‌‌ను పాటించకుండా, మాస్కులు వేసుకోకుండా పాల్గొన్నారని సర్వే నిర్వహించిన రీసెర్చర్స్ చెప్పారు. దీని ఫలితంగా వేల మందికి కరోనా సోకిందని తెలిపారు. ట్రంప్ ర్యాలీలు కరోనా సూపర్ స్ప్రెడర్‌‌గా మారాయని, కరోనా నియంత్రణ చర్యలను ఇవి తీవ్రంగా దెబ్బతీశాయని సర్వే పేర్కొంది.