12 – 14 ఏళ్ల పిల్లల్లో 50 లక్షల మందికి ఫస్ట్ డోస్

12 – 14 ఏళ్ల పిల్లల్లో 50 లక్షల మందికి ఫస్ట్ డోస్

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. వారం క్రితం మొదలైన 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల వ్యాక్సినేషన్ అప్పుడే అర కోటి మైలు రాయిని దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ మన దేశంలోనే సాగుతోందని, ఈ కార్యక్రమంలో ఇవాళ మరో మైలు రాయిని దాటామని ఆయన ట్వీట్ చేశారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల్లో 50 లక్షల మందికి పైగా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసి చెప్పారు.

 

కాగా, దేశంలో అన్ని వయసుల వారికీ కలిపి ఇప్పటి వరకు 182 కోట్ల డోసులు వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ఫస్ట్ డోస్ 97.72 కోట్లు, రెండో డోస్ 83.29 కోట్లు, బూస్టర్ డోస్ 2.08 కోట్లు చొప్పున ఉన్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం..

ప్రతి నెలా ఎన్నికలు ఉంటే పెట్రోల్ రేట్లు పెరగవు

అవినీతిపై ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం