అవినీతిపై ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్

అవినీతిపై ఫిర్యాదులకు వాట్సాప్ నంబర్

పంజాబ్లో కొత్తగా అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ.. ఆ రాష్ట్రంలో అవినీతిపరుల ఆట కట్టించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్ నంబర్ ను సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ పేరుతో ఒక వాట్సాప్ నంబర్ ను ఆయన విడుదల చేశారు. దేశం కోసం భగత్ సింగ్ బలిదానం చేసిన రోజైన షహీద్ దివస్ (మార్చి 23) సందర్భంగా ఖట్కర్ కలాన్‌లో ఆయన నివాళి అర్పించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల విగ్రహాల వద్ద నివాళి అర్పించిన అనంతరం భగవంత్ మాన్ యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ నంబర్ ను రిలీజ్ చేశారు. ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రం నుంచి అవినీతి భూతాన్ని తరిమికొడదామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా లంచం అడిగినా, మరేదైనా అవినీతికి పాల్పడినట్లు ఎవరి దృష్టికి వచ్చినా సరే ఈ వాట్సాప్ నంబర్ కు వీడియో లేదా ఆడియో రికార్డింగ్ పంపితే స్వయంగా తన పర్యవేక్షణలో ఉండే అధికారుల టీమ్ పరిశీలించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పంజాబ్లో అవినీతి అనే మాట ఉండకుండా చేస్తామన్నారు. అవినీతి రహిత పంజాబ్ సాకారమైతే అదే స్వాతంత్ర్య సమర యోధులకు మనం తెలిపే నిజమైన నివాళి అని అన్నారు.

సీఎం విడుదల చేసిన నంబర్ ఇదే: 9501200200

మరిన్ని వార్తల కోసం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఎండల తీవ్రత.. పెరిగిన ఏసీ, కూలర్ల సేల్స్

బీజేపీపై ఉన్న కోపాన్ని రైతుల మీద చూపిస్తున్న కేసీఆర్