విశాఖ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్

విశాఖ చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్

మహారాష్ట్ర కలాంబోలి నుంచి ప్రారంభమైన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఇవాళ ఉదయం విశాఖ పట్నం చేరుకుంది. దాదాపు 7 ఖాళీ ట్యాంకర్లతో ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలాంబోలి గూడ్స్ యార్డ్ నుంచి ఈ నెల 19న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ బయలు దేరింది. ఆక్సిజన్ ట్యాంకర్ల అన్ లోడింగ్ కు వీలుగా వీటికి ఆయా ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు అమాంతంగా డిమాండ్ పెరిగింది. దీంతో మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి అవసరమున్న చోటుకు తరలించేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. విశాఖ పట్నం, జంషెడ్ పూర్, రూర్కెలా, బొకారో నుంచి ట్రైన్స్ ఆక్సిజన్ ను అవసరమున్న చోటుకు తీసుకెళ్లనున్నాయి.