8 కీలక రంగాల్లో భారీ మార్పులు

8 కీలక రంగాల్లో భారీ మార్పులు

బొగ్గు రంగంలో ప్రభుత్వ మోనోపోలి తొలగింపు
కోల్ కమర్షియల్ మైనింగ్​కు అనుమతి
500 మైనింగ్‌‌ బ్లాకుల బహిరంగ వేలం
ఆయుధాల తయారీలో ఎఫ్​డీఐలు 74 శాతానికి పెంపు
కొన్ని ఆయుధాల కొనుగోలుపై నిషేధం
ఇస్రో ఫెసిలిటీస్ వాడుకునేందుకు ప్రైవేటు సంస్థలకు పర్మిషన్
దేశంలో 6 ఎయిర్​పోర్టుల వేలం
వెల్లడించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: మెగా రీఫార్మ్స్ వైపు కేంద్రం అడుగులేసింది. ప్రపంచవ్యాప్త పోటీకి రెడీ కావాలంటే.. నిర్మాణాత్మక సంస్కరణలపై ఫోకస్ పెట్టాలని చెప్పింది. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు జోష్ పెంచింది. బొగ్గు, స్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ సహా మొత్తం 8 రంగాలకు రాయితీలు ప్రకటించింది. వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. పలు రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా నాలుగో విడత ఎకనమిక్ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిఫెన్స్ ప్రొడక్షన్​లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ల (ఎఫ్‌డీఐ) శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. స్పేస్ రీసెర్చ్, ఏవియేషన్, మైన్స్, మినరల్స్ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్​తో కలిసి నిర్మల మీడియాకు వివరించారు.

బొగ్గు కమర్షియల్ మైనింగ్

బొగ్గు రంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని (మోనోపోలి) తొలగిస్తున్నామని కేంద్ర మంత్రి సీతారామన్ ప్రకటించారు. కోల్ కమర్షియల్ మైనింగ్​కు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెక్టార్​లో ప్రైవేటును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టన్నుకు స్థిరమైన ధర కాకుండా ఇక రెవెన్యూ షేరింగ్ మెకానిజం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటిదాకా క్యాప్టివ్​వ్‌ మైనింగ్‌కు మాత్రమే వేలంలో పాల్గొనే అనుమతి ఉండేదని, ఆ రూల్స్ తొలగిస్తున్నామన్నారు. బిడ్డింగ్ కు 50 బ్లాక్స్‌ కేటాయిస్తున్నట్లు తెలిపారు. బొగ్గు తవ్వకాలు, మౌలిక వసతుల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తున్నామని, కోల్ గ్యాసిఫికేషన్, కోల్ బెడ్ మీథేన్ ను ప్రోత్సహిస్తామన్నారు.

యూటీల్లో డిస్కంల ప్రైవేటైజేషన్

దేశంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డిస్కంలలో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ చార్జీల సంస్కరణలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. యూటీల్లో డిస్కంలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని వెల్లడించారు.

ప్రైవేట్ ‘స్పేస్..’

శాటిలైట్లు, స్పేస్​బేస్డ్ సర్వీసులు సహా ఇండియా స్పేస్ ప్రోగ్రామ్​లో సెక్టార్​లోనూ ప్రైవేటు అవకాశం ఇవ్వనున్నట్లు నిర్మల చెప్పారు. స్పేస్ యాక్టివిటీల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు.. ఉపగ్రహాలు, ప్రయోగాలు, అంతరిక్ష-ఆధారిత సేవల్లో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం స్థలం ఇస్తుందని చెప్పారు. గ్రహాల అన్వేషణ, స్పేస్ ట్రావెల్ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టుల్లో ప్రైవేటుకు అవకాశం ఇవ్వనున్నారు.

ఇండస్ట్రియల్ పార్క్​లకు ర్యాంక్​లు

పెట్టుబడి పెట్టగల ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి.. పెట్టుబడిదారులు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ కోసం ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇండస్ర్టియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఐఎస్) కింద దేశవ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న 3,376 ఇండస్ర్టియల్ పార్క్​లు, ఎస్టేట్లు, సెజ్​లను మ్యాప్ చేసినట్లు తెలిపారు.

సోషల్ ఇన్​ఫ్రాకు 8,100 కోట్లు

సోషల్ ఇన్​ఫ్రాస్ర్టక్చర్ డెవలప్​మెంట్ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)​కు నిధులు ప్రకటించారు. రూ.8100 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్స కోసం రీసెర్చ్ రియాక్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మల తెలిపారు. మెడికల్ ఐసోటోపుల ప్రొడక్షన్ కు  పీపీపీ విధానంలో రియాక్టర్ ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి