తిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం

తిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం

తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది. భ‌క్తులు త‌మ వాహ‌నాల‌కు వ్య‌క్తుల ఫోటోలు, రాజ‌కీయ పార్టీల జెండాలు,  చిహ్నాలు, అన్య‌మ‌త ప్ర‌చారానికి సంబంధించిన ప్ర‌చార సామ‌గ్రి,  తిరుమ‌లకు తీసుకురావడాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధం విధించడం జరిగిందని.. ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నామని టీటీడీ పేర్కొంది.

టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది అలిపిరి వ‌ద్ద అటువంటి వాహ‌నాల‌ను తిరుమ‌ల‌కు అనుమ‌తించ‌రు. ఇది ఎన్నో ద‌శాబ్ధాలుగా అనుస‌రిస్తున్న నిబంధ‌న‌. ఇటీవల కాలంలో తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫోటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలతో రావడం జరుగుతోంది. వీటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు విషయం వివరించి వాటిని తీసివేయడం జరుగుతోందన్నారు. వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి  స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

 

ఇవి కూాడా చదవండి

తమిళనాడు స్కూళ్లలో 5వ తరగతి వరకు ఫ్రీ టిఫిన్

 

పెట్రోల్, డీజిల్ పై రూ.56 కోట్లు వసూలు

సంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంది..!