పహల్గాంలో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు వీళ్లే..:ఊహాచిత్రాలు రిలీజ్ చేసిన సైన్యం

పహల్గాంలో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు వీళ్లే..:ఊహాచిత్రాలు రిలీజ్ చేసిన సైన్యం

జమ్మూలోని పహల్గాంలో దుర్మార్గంగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు రిలీజ్ చేసింది సైన్యం. ఏకే 47 తుపాకులతో కాల్పులు జరుపుతూ..26 మందిని బలి తీసుకున్న లష్కర్ తోయిబా గ్రూపునకు చెందిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు విడుదల చేసింది భారత సైన్యం.

మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి 26మందిని బలిగొన్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్ లను ఆర్మీ రిలీజ్ చేసింది. టూరిస్ట్ స్పాట్ బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు  2019 లో పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. ఆరుగురు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారు జామున దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరి ఫొటో ఆన్ లైన్ కూడా కనిపించింది. ఈ ఫొటోలో  ఉగ్రవాది AK47 రైఫిల్ పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తుంది.