పాకిస్తాన్​ జైళ్లలో 682 మంది ఇండియన్లు

పాకిస్తాన్​ జైళ్లలో 682 మంది ఇండియన్లు

న్యూఢిల్లీ: పాకిస్తాన్​లో 682 మంది ఇండియన్లు ఖైదీలుగా ఉన్నారు. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.  ఖైదీలుగా ఉన్న వారిలో 49 మంది సాధారణ పౌరులుకాగా..633 మంది మత్య్సకారులని వెల్లడించింది. ఇక మన దేశంలో 461 మంది పాక్ పౌరులు ఖైదీలుగా ఉన్నారని  ఢిల్లీలోని విదేశాంగ శాఖ తెలిపింది. అందులో 345 మంది సాధారణ పౌరులు,116 మంది మత్స్యకారులునట్లు స్పష్టం చేసింది.