ODI World Cup 2023: భారత్ వెళ్లం.. పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో జరగాలి: పాకిస్తాన్ మంత్రి

ODI World Cup 2023: భారత్ వెళ్లం.. పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో జరగాలి: పాకిస్తాన్ మంత్రి

'బీసీసీఐ vs పీసీబీ..' ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఉన్న వైరం వన్డే ప్రపంచకప్‍ 2023పై ప్రభావం చూపుతోంది. ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్‍కు వెళ్లేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భద్రతను సాకుగా చూపుతూ.. హైబ్రిడ్ పద్ధతిని తెరమీదకు తెచ్చింది. ఈ పద్ధతి ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఆసియా కప్ మ్యాచులను కుదించారు. కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే పాక్ వేదికగా జరగనుండగా.. మిగిలిన మ్యాచులను శ్రీలంకకు తరలించారు. ఇప్పుడు పాక్ మంత్రులు.. వరల్డ్ కప్ మ్యాచులను ఇదే తరహాలో నిర్వహించాలని సూచిస్తున్నారు. 

తటస్థ వేదికల్లో పాక్ మ్యాచులు

వన్డే ప్రపంచకప్‍ 2023 కోసం పాకిస్తాన్ జట్టు.. ఇండియాలో పర్యటించనుందా! అన్న విషయపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాక్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ.. ఆసియా కప్‍ 2023లో ఇండియా మ్యాచ్‍లు పాకిస్థాన్‍లో కాకుండా తటస్థ వేదికల్లో జరగాలని బీసీసీఐ అనుకుంటే.. ప్రపంచకప్‍లో పాక్ మ్యాచ్‍లు కూడా అదే తరహాలో జరగాలని తాను భావిస్తున్నాని చెప్పుకొచ్చారు.

"పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీబి) నా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది.. కావున నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చేప్పేది ఏంటంటే.. ఒకవేళ ఆసియాకప్‍ 2023లో తమ మ్యాచ్‍లను పాకిస్థాన్‍లో కాకుండా తటస్థ వేదికల్ల జరగాలని భారత్ డిమాండ్ చేస్తే.. మేము కూడా అదే డిమాండ్ చేస్తాం. భారత్‌లో జరిగే మా ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో జరపాలని చెప్తాం. అంగీకరించంటే.. వన్డే ప్రపంచకప్‍కు పాక్ జట్టును భారత్‍కు పంపం.." అని ఆయన వెల్లడించారు.

పాకిస్తాన్ జట్టును.. భారత్ కు పంపాలా! వద్దా అన్న విషయపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ కమిని నియమించిన కొన్ని గంటల్లోనే క్రీడా మంత్రి మజారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రధానిదేనని ఆయన స్పష్టం చేశారు. షెహబాజ్ షరీఫ్ నియమించిన అత్యున్నత స్థాయి కమిటీకి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహించున్నారు. ఇందులో మొత్తం 11 మంది సభ్యులు ఉండగా.. అందులో పాక్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ ఒకరు.