యూనివర్సిటీల్లో హోలీ వేడుకలపై నిషేధం.. విద్యార్థులకు ఆ దేశం హెచ్చరిక

యూనివర్సిటీల్లో హోలీ వేడుకలపై నిషేధం.. విద్యార్థులకు ఆ దేశం హెచ్చరిక

విద్యార్థులు రంగుల పండుగను జరుపుకుంటున్న వీడియోలు వెలువడిన కొద్ది రోజుల తర్వాత పాకిస్థాన్ ఉన్నత విద్యా కమిషన్ యూనివర్సిటీల్లో హోలీ వేడుకలను నిషేధించింది. "ఇటువంటి కార్యకలాపాలు దేశం సామాజిక-సాంస్కృతిక విలువల నుంచి పూర్తిగా డిస్‌కనెక్ట్‌ చేస్తాయి. దేశంలోని ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తాయి" అని ఈ సందర్భంగా ఓ నోటీసును రిలీజ్ చేసింది.

జూన్ 12న ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్-ఐ-అజం యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో హోలీ వేడుకని జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత HEC ఆర్డర్ వచ్చింది. ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారాయి. కళాశాల క్యాంపస్‌లో విద్యార్థులు రంగులతో హోలీ ఆడుతూ వేడుకలను ఎంజాయ్ చేస్తూ విద్యార్థులు ఈ వీడియోల్లో కనిపిస్తున్నారు. "సామాజిక సాంస్కృతిక విలువలకు" కట్టుబడి ఉండటానికి విద్యార్థులు ఈ పండుగను చేసుకోవడాన్ని నిషేధించారని కమిషన్ నోటీసులో పేర్కొంది.

https://twitter.com/NewsQau/status/1670874677869420545