
విదేశీ పర్యాటకులతో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఓ ప్రసిద్ధ పాకిస్తానీ వంట మనిషిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. ఊరికే అరెస్ట్ చేశారేమో అనుకొని అతని పట్ల సానుభూతి తెలపకండి.. అతను దినచర్య ఏంటో తెలుసా..? తన రెస్టారెంట్ వైపుగా వచ్చే విదేశీ మహిళా పర్యాటకులతో చిందులేయటం.. అనుమతి లేకుండా వారికి ముద్దులివ్వటం. ఇదే అతగాడు పని.
అరెస్టైన వ్యక్తి పేరు.. నిసార్. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో అతిని పేరుపైనే ఓ రెస్టారెంట్ ఉంది. అంత ఫేమస్ అతను. ఎంత బాగా వండగలడో.. అంత బాగా చిందేయగలడు. ఇదీ ఓ అందుకు మంచికే అయినా.. అతను చిందేసే తీరే కాస్త శృతిమించుతోంది. విదేశీ మహిళా పర్యాటకులు తన కంట పడ్డారో అంతే సంగతులు. తనలోని కామాంధుడు బయటకొచ్చేస్తాడు.
ఇటీవల ఓ మహిళా పర్యాటకులరాలితో కాళ్లు కదిలించిన అతగాడు.. ఆమెను ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాకుతూ హంగామా సృష్టించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతని పాపం పండింది. విదేశీ పర్యాటకులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గానూ నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక మీడియా నివేదిక నివేదించింది.
نثار چرسی کا کئی بار غیر ملکی سیاخوں کے ساتھ غیر اخلاقی حرکتیں برداشت سے باہر اس سے پشتونوں کی بدنامی ہوتی ہے اور پھر خاک غیر ملکی یہاں آینگے اس پر کے پی کے پولیس ایکشن لے ۔ @PeshawarCCPO@iihtishamm#anshaafridi pic.twitter.com/wvKpyJ9VCf
— Wali Rehman (@WaliUrRehman333) September 20, 2023