Asian Games 2023: పతకం లేకుండానే ఇంటికెళ్లిన పాక్ క్రికెట్ జట్టు .. ఇంతకన్నా అవమానం ఉంటుందా

Asian Games 2023: పతకం లేకుండానే ఇంటికెళ్లిన పాక్ క్రికెట్ జట్టు .. ఇంతకన్నా అవమానం ఉంటుందా

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. ఎమర్జింగ్ ఆసియా కప్ గెలిచి హాట్ ఫేవరేట్ గా దిగిన పాకిస్థాన్ కి ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్ హాంగ్ కాంగ్ మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై గెలవలేక చతికిలపడింది.

సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇక నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులోనూ నిరాశే ఎదురైంది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో పాక్ చివరి బంతికి ఓడిపోయింది. దీంతో కనీసం కాంస్య పతాకాన్ని గెలవకుండానే ఇంటిదారి పట్టింది. మరోవైపు భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకోగా.. ఆఫ్ఘనిస్తాన్ కి సిల్వర్ మెడల్ దక్కింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్ కాంస్య పతకం గెలుచుకుంది.

 
ఇక పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకి కూడా ఎలాంటి మెడల్ దక్కలేదు. భారత్ కి గోల్డ్, శ్రీలంకకు సిల్వర్, బంగ్లాదేశ్ కి బ్రోన్స్ మెడల్ దక్కింది. కాగా.. ఇటీవలే ఆసియా కప్ లో పాకిస్థాన్ ఫైనల్ కి అర్హత సాధించలేక నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా.. ఆసియా క్రీడల్లో కూడా నాలుగో స్థానంలో నిలిచింది.