Pakistan:గోధుమ పిండి కోసం తొక్కిసలాట

Pakistan:గోధుమ పిండి కోసం తొక్కిసలాట

దాయాది దేశం పాకిస్తాన్లో ప్రస్తుతం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలో చివరకు రొట్టెపిండి కూడా దొరకడం కష్టంగా మారింది. పాక్ లోని పలు మార్కెట్లలో రొట్టె పిండి కోసం జనం గుంపులు..గుంపులుగా ఎగబడుతున్నారు.పాక్ లో  గోధుమల కొరత కారణంగా అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. గోధుమ పిండి కోసం బైబర్, ఫఖ్తున్ ఖ్వా, సింధ్, బలుచిస్తాన్ ప్రావిన్స్ లలో ని అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరిగాయి. 

ఆహార సంక్షోభం కారణంగా పాక్ లో గోధుమల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. సామాన్య,పేద ప్రజలు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. కరాచీలో కేజీ గోదుమ పండి 140 నుంచి 160 రూపాయాలకు విక్రయిస్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలలో 10 కిలోల పిండి  సంచి రూ.15,00  ఉండగా..20 కిలోల బ్యాగ్ ధర రూ.2,800 ధర పలుకుతోంది. 

ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌ నివేదిక ప్రకారం మార్కెట్‌లో ఇప్పటికే సరఫరాలో తక్కువ ఉన్న పిండి బస్తాలను పొందేందుకు ప్రతిరోజూ పదివేల మంది గంటల పాటు క్యూలో గడుపుతున్నారని పేర్కొంది. మినీ ట్రక్కులు, వ్యాన్‌లు సాయుధ గార్డులతో కలిసి పిండి పంపిణీ చేస్తున్నప్పుడు వాహనాల చుట్టూ ప్రజలు గుమిగూడి ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళ దృశ్యాలు తరచుగా కనిపిస్తున్నాయి.  పాకిస్తాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య గోధుమలు, పిండి ధరలు విపరీతంగా పెరిగాయని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్‌జాయ్ ప్రావిన్స్‌లో గోధుమ నిల్వ "పూర్తిగా ముగిసిందని అన్నారు. బలూచిస్థాన్‌కు తక్షణమే 400,000 గోధుమల బస్తాలు అవసరమని, లేకుంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు సిద్ధమైంది.