పాక్ విదేశాంగ మంత్రికి క‌రోనా పాజిటివ్

పాక్ విదేశాంగ మంత్రికి క‌రోనా పాజిటివ్

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మ‌హ‌మూద్ ఖురేషీకి క‌రోనా వైర‌స్ సోకింది. తాను ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన‌ట్లు ఆయ‌న శుక్ర‌వారం సాయంత్రం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. మ‌ధ్యాహ్నం త‌న‌కు స్వ‌ల్పంగా జ్వ‌రం వ‌చ్చిన‌ట్లు అనిపించింద‌ని, వెంట‌నే తాను హోం క్వారంటైన్‌లోకి వెళ్లాన‌ని చెప్పారు. క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని ట్వీట్ చేశారు. అల్లా ద‌య వ‌ల్ల ప్ర‌స్తుతం తాను ఎన‌ర్జిటిక్‌గానే ఉన్నాన‌ని తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉంటూనే త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తాన‌ని పేర్క‌న్నారు ఖురేషీ. ప్ర‌జ‌లు త‌మ ప్రార్థ‌న‌ల్లో త‌న గురించి వేడుకోవాల‌ని కోరారు. కాగా, పాకిస్థాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,21,896 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అందులో 4,551 మంది మ‌ర‌ణించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని 1,13,623 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆ దేశంలో 1,03,722 మంది క‌రోనాతో చికిత్స పొందుతున్నారు.