పాక్​లో ఆర్థిక సంక్షోభం... ప్లాస్టిక్​ కవర్లలో వంట గ్యాస్​

 పాక్​లో ఆర్థిక సంక్షోభం... ప్లాస్టిక్​ కవర్లలో వంట గ్యాస్​

పాకిస్తాన్‌లో రోజురోజుకి ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వంటగ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. వంట గ్యాస్ అవసరాలను తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బెలూన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్యాస్ నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టారని డాన్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్‌ను నింపుకోవడమంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని పేర్కొంది. సరఫరా లేకపోవడంతో Khyber Pakhtunkhwa province ప్రాంత వాసులు బెలూన్‌ లలో గ్యాస్ ను నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తున్నారు.అయితే ఇంకా  అధికారికంగా ధృవీకరించలేదు.

కరక్ జిల్లాలో 2007 నుంచి గ్యాస్ కనెక్షన్ లేకుండా ప్రజలు ఉన్నారని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. పాక్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధిస్తోంది. నిత్యావసరాల సరుకులు ఆకాశాన్నంటుతున్నాయి. యుటిలిటీ స్టోర్స్ కార్పొరేషన్ (USC) ద్వారా విక్రయించే గోధుమ పిండి, చక్కెర, నెయ్యి ధరలను పాక్ సర్కార్ 25 నుంచి 62 శాతం వరకు పెంచిందని డాన్ తెలిపింది. పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడంతో పాక్ కష్టాలను ఎదుర్కొంటోంది.