దేశం మొత్తం పెట్రోల్ బంకులు బంద్.. ఎక్కడంటే ?

దేశం మొత్తం పెట్రోల్ బంకులు బంద్.. ఎక్కడంటే ?

ద్రవ్యోల్బణం రేటులో పెరుగుదల ఫలితం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంధన ధరలు, పన్నులను పెంచుతోంది అక్కడి ప్రభుత్వం.   దీంతో పాకిస్థాన్ పెట్రోలియం డీలర్లు రేపటి ( జులై 22) నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో పాకిస్థాన్ కరెన్సీ బలహీనపడటంతో ఈ సమ్మె జరుగుతుంది.

పాకిస్థాన్ లో జూలై 22  సాయంత్రం 6 గంటల నుంచి   పెట్రోల్ బంక్ లను నిరవధింగా  మూసేయాలని పాకిస్తాన్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (పీపీడీఏ) నిర్ణయించినట్లు  జియో న్యూస్ వెల్లడించింది.  పీపీడీఏ పరిధిలోని దాదాపు 10 వేల పెట్రోల్ బంక్ యజమానులు సమ్మెబాట పడుతున్నారు.  అత్యవసర సర్వీసులకు కూడా పెట్రోల్, డీజిల్ అమ్మమని తెలిపారు.  అంబులెన్స్, పాలు, పోలీస్ ఇతర ముఖ్యమైన వాహనాలకు కూడా విక్రయించేది లేదని తెలిపారు.  దీంతో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్థంభించనుంది. పెట్రోలు బంక్  వ్యాపారాలు అధిక వడ్డీ రేట్ల  కారణంగా డీలర్‌షిప్ మార్జిన్‌ను పెంచాలని వారు కోరారు.   ఇరాన్ ఇంధనాన్ని పాకిస్తాన్‌లో అక్రమంగా రవాణా చేయడంతో పెట్రోలియం అమ్మకాలు 30 శాతం తగ్గాయి.  ఇది దేశంలో పెట్రోలు సరఫరాపై ప్రధానంగా ప్రభావం చూపుతుంది.  పాకిస్తాన్ పెట్రోల్‌పై  బంక్ ఆపరేటర్లు  లీటరుకు 12రూపాయిులు మార్జిన్‌ను కోరారు . ప్రస్తుతం పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరు 282 రూపాయిలుగా ఉంది.   మేలో 38శాతం ఉన్న  ద్రవ్యోల్బణం 29.4 శాతానికి పడిపోవడంతో  సమ్మె జరిగుతుంది.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ లో  నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఇప్పుడు తాజాగా పీపీడీఏ తీసుకున్న నిర్ణయంతో రవాణా పూర్తిగా నిలిచిపోయి.. ధరలు ఇంకా పెరుగుతాయని ఆ దేశ ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.  ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాయి.  ఇప్పుడు పీపీడీఏ నిర్ణయంతో  పాకిస్థాన్ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనని పలు దేశాలు ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 

పాక్‌ ప్రజల తలసరి ఆదాయం కూడా తగ్గింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి బెయిలౌట్ ప్యాకేజీ పూర్తిగా రాకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పాకిస్థాన్ ప్రజలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్నారు. గృహ వ్యయం పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.  మన దేశంలో ద్రవ్యోల్బణం 6 స్థాయికి చేరితే, ధరలు మండిపోతున్నాయంటూ జనం గగ్గోలు పెట్టారు. ద్రవ్యోల్బణం కట్టడి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటును భారీగా పెంచింది. మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం మన దగ్గర కంటే ఆరు రెట్లు ఎక్కువ నమోదైంది. ఇక ఆ దేశంలో ధరలు, ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.