ఐఎంఎఫ్ షరతులు కష్టంగా ఉన్నయ్.. అయినా మాకు మరో దారిలేదు!

ఐఎంఎఫ్ షరతులు కష్టంగా ఉన్నయ్.. అయినా మాకు మరో దారిలేదు!
  • పాకిస్తాన్​ ప్రధాని షహబాజ్ షరీఫ్

పెషావర్: పాకిస్తాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) ఆర్థిక సాయం కోసమే ఎదురు చూస్తున్నామని ఆ దేశ ప్రధాని షహబాజ్​ షరీఫ్ అన్నారు. ఐఎంఎఫ్​ పెడుతున్న కండీషన్లు చాలా కష్టంగా ఉన్నాయని, ఊహకు కూడా అందవని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్​ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ఆర్థిక మంత్రి ఇషాక్ దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐఎంఎఫ్​ను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ఐఎంఎఫ్​ చెప్పిన కండీషన్లను రీచ్ అవడం మా శక్తికి మించిన పనిగా అనిపిస్తున్నది. మాకు వేరే చాన్స్​ లేదు. అందుకే ఐఎంఎఫ్​​ రూల్స్ పాటించాల్సిందే.. వివరాలు వెల్లడించలేను. దేశంలో ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది” అని ప్రధాని షరీఫ్ అన్నారు. 

అంగీకరించకపోతే ప్యాకేజీ కష్టం

నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్​ టీం మంగళవారం పాకిస్తాన్​కు వచ్చిందని ప్రధాని షరీఫ్​ తెలిపారు. అక్టోబర్​లో నేషనల్​ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఐఎంఎఫ్​ విధించిన షరతులు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పారు. పన్నులు పెంచాలని, సబ్సిడీలకు కోతలు విధించాలనే కండీషన్లు పెడుతున్నదని వివరించారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అయినా ఐఎంఎఫ్​ వెనక్కి తగ్గడం లేదన్నారు. అంగీకరించకపోతే బెయిల్​ఔట్​ ప్యాకేజీ కష్టమని చెబుతున్నదని తెలిపారు. కరెంట్​ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన తమ ముందు ఉంచిందని వివరించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాక్​వద్ద విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లే ఉన్నాయి. బుధవారానికి ఇన్​ఫ్లేషన్​ 48 ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. 7 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు ఐఎంఎఫ్​ సిద్ధంగానే ఉన్నా... అందుకు తగిన అర్హతలు పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్నాయా.. లేదా.. అని సమీక్షిస్తున్నది. ఈ లోన్ ఇచ్చేందుకు ఇప్పటికే 8సార్లు ఐఎంఎఫ్​ టీం పాక్​కు వచ్చి వెళ్లింది. తాజాగా మళ్లీ మంగళవారం పాక్​కు వచ్చి తొమ్మిదో సారి సమీక్ష జరుపుతున్నది.