ఆర్టికల్ 370 రద్దుపై పాక్ వక్రబుద్ధి

ఆర్టికల్ 370 రద్దుపై పాక్ వక్రబుద్ధి

ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది. భారత్ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై పాక్ కు ఎలాంటి సంబంధంలేకపోయినా..అనవసరంగా తలదూరుస్తుంది. కశ్మీర్‌ ఒక అంతర్జాతీయ వివాదమని, అందులో తాము భాగస్వామిగా ఉన్నామని తెలిపింది. భారత్‌ చట్టవ్యతిరేక చర్యల నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు పాక్‌ కట్టుబడి ఉందంటూ ప్రకటన చేసింది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ ఆర్టికల్ ను సోమవారం రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు దేశాల ప్రముఖులు మోడీకి విషెస్ తెలుపుతుండగా.. పాకిస్థాన్‌ మాత్రం ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు చేసి మరోసారి వక్రబుద్ధిని చూపించింది.