
‘యూఎన్’ సెక్యూరిటీ కౌన్సిల్‌లో నాన్‌పర్మనెంట్ సీటుకు..
యునైటెడ్ నేషన్స్: మన దేశానికి డిప్లమాటిక్ విజయం దక్కింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో నాన్ పర్మనెంట్ సీటు కోసం పాకిస్తాన్, చైనా సహా 55 ఏషియా – పసిఫిక్ గ్రూప్ దేశాలు మనకు మద్దతు తెలిపాయి. 2021 – 22 కాలానికి 15 దేశాల కౌన్సిళ్లలోని ఐదు నాన్‌పర్మనెంట్ సీట్లకు వచ్చే ఏడాది జూన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. “ రెండు సంవత్సరాల కాలానికి సెక్యూరిటీ కౌన్సిల్‌లో మా అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన 55 మంది సభ్యులకు థ్యాంక్స్” అని యూఎన్‌లో ఇండియా పర్మనెంట్ అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.
చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యూఎస్ నేషనల్ కౌన్సిల్‌లో పర్మనెంట్ సభ్యులు కాగా.. ఐదుగురు నాన్‌పర్మనెంట్ సభ్యులను 193 మందితో కూడిన జనరల్ అసెంబ్లీ మెంబర్స్ ఎంపిక చేస్తారు. రీజనల్ బేసిస్ మీద 10 నాన్‌పర్మనెంట్ సీట్లు ఉంటాయి. దీంట్లో భాగంగా ఆఫ్రికన్, ఆసియా స్టేట్స్‌కు 5, ఈస్ట్రన్ యూరప్ స్టేట్స్‌కు 1, లాటిన్ అమెరికా, కరేబియన్ స్టేట్స్‌కు 2, వెస్ట్రన్ యూరోపియన్, మిగతా స్టేట్స్‌కు కలిపి 2 సీట్లను కేటాయిస్తారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యత్వానికి ఇండియా కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ డిప్లమాటిక్ విజయంతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా పర్మనెంట్ మెంబర్‌గా అర్హత పొందే వీలు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇండియాకు సపోర్ట్ చేసిన దేశాలు
ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఇండోనేషియా, ఇరాన్, జపాన్, కువైట్, కిర్జిస్తాన్, మలేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, ఖత్తార్, సౌదీ అరేబియా, శ్రీలంక, సిరియా, టర్కీ, యూఏఈ, వియత్నాం.