
జమ్ముకశ్మీర్‌కు ఇప్పటి వరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత పాకిస్తాన్.. భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూ పోతోంది. దౌత్య, వాణిజ్య సంబంధాల తో పాటు వినోద రంగాన్ని తెగదెంపులు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను నిలిపివేసిన పాక్.. ఆ తర్వాత థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేసింది. ఇవాళ(శనివారం) ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే బస్సు సేవలను కూడా నిలిపివేసింది.
ఢిల్లీ గేట్ సమీపంలోని అంబేద్కర్ స్టేడియం బస్ టెర్మినల్ నుంచి ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో లాహోర్‌కు ఈ బస్సులు బయలుదేరుతాయి. అదే సమయంలో పాకిస్తాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (PTDC) మంగళ, గురు, శనివారాల్లో ఢిల్లీకి బస్సులు నడుపుతోంది.
మొదటి సారిగా 1999, ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి తర్వాత ఆ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మళ్లీ 2003లో ఆ బస్సు సేవలను పునరుద్ధరించారు. తాజాగా మళ్లీ బస్సు సర్వీసులను పాక్ రద్దు చేసినట్లు పాకిస్తాన్ మంత్రి మురాద్ సయీద్ తెలిపారు.