మసూద్‍ను అజార్‍ను అరెస్ట్ చేయాలని పాక్ లేఖ

 మసూద్‍ను అజార్‍ను అరెస్ట్ చేయాలని పాక్ లేఖ

జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్టు చేయాలని కోరుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు లేఖ రాసింది. పాకిస్తాన్ మీడియా సంస్థ బోల్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం, మసూద్ ఆఫ్ఘనిస్తాన్ లోని నంగర్ హర్, కన్హర్ ప్రాంతాల్లో ఉన్నాడని సమాచారం. పారిస్ కు చెందిన ఇంటర్నేషనల్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ () పలువురు ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని పాక్ ను ఫోర్స్ చేసిన అనంతరం ఈ నివేదిక వచ్చింది. ఇప్పడు గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకే పాక్ ఈ లేఖ రాసినట్టు సమాచారం. అతను అక్కడే ఉన్నాడని లేఖలో పేర్కొన్న పాక్.. జేషఏను ఎలాగైనా కనిపెట్టి అరెస్ట్ చేయాలని కోరింది. కానీ ఆఫ్ఘనిస్తా్న్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.

ఎఫ్‌ఏటీఎఫ్ ఒత్తిడి కారణంగానే మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ లేఖ రాసి ఉండొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 31, 1999న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఐసి 814 హైజాక్ తర్వాత మసూద్ అజార్ ను  భారత్  విడుదల చేసింది. ఈ క్రమంలోనే భార‌త్ తో పాటు ఐక్యరాజ్య స‌మితి సైతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. మసూద్ అజార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌కు లేఖ రాయడం ఇది రెండోసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో మంత్రుల స్థాయి చర్చల సందర్భంగా మసూద్ అజార్ అరెస్టు అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌, ఉగ్రవాది మసూద్‌ అజార్‌ల పేర్లను ప్రపంచ ఉగ్రవాద సంస్థల జాబితాలో నమోదు చేయాలని ఐక్యరాజ్యసమితిలో భారత్‌ డిమాండ్‌ చేసింది. అయితే ఈ డిమాండ్‌పై చైనా మాత్రం అడ్డుక‌ట్ట వేస్తుంది.