ఇమ్రాన్‌‌ ఖాన్ అరెస్టుకు వారెంట్ జారీ

ఇమ్రాన్‌‌ ఖాన్ అరెస్టుకు వారెంట్ జారీ

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌‌పై ఆ దేశ ఎలక్షన్ కమిషన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీపై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)పై  తెహ్రీక్ -ఇ -ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్, పార్టీ నేతలు ఫవాద్ చౌదరీ, అసద్ ఉమర్‌‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈసీపీలో గతేడాది కంప్లైంట్ రిజస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ఈసీపీ పలుమార్లు ఆదేశించినా పీటీఐ నేతలు విచారణకు హాజరుకాలేదు. 

దాంతో మంగళవారం ఈసీపీ మెంబర్ నిసార్ దుర్రానీ నేతృత్వంలోని బెంచ్ ఇమ్రాన్ ఖాన్‌‌, ఫవాద్ చౌదరీపై వారెంట్ జారీ చేసింది. అనారోగ్యం వల్ల ఉమర్​కు కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది.