కేసీఆర్‌‌ ప్రభుత్వంలా మేం మోసం చేయం .. ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కేసీఆర్‌‌ ప్రభుత్వంలా మేం మోసం చేయం ..  ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కేసీఆర్ సర్కార్ మోసం చేసిందని, అయితే కాంగ్రెస్‌ సర్కార్ మాత్రం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకుపోతోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె.. ప్రజల నుంచి పలు ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కారించాలని కోరారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

 ప్రజా పాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. ప్రజలకు మేలు చేయడంపైనే తన దృష్టి అని, రాజకీయాలు పట్టించుకోనని చెప్పారు. పాలకుర్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.