మహబూబ్‌నగర్, వెలుగు: గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు గ్రామ అభివృద్ధిని కోరుకుంటున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉండే వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. చేసిన పనులకు కూడా ఆ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తుంది కేంద్రమేనని, బీజేపీ మద్దతుదారులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు.
రూ.20 లక్షల నిధులిస్తా..
మరికల్: మరికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్‌ను గెలిపిస్తే రూ.20 లక్షల నిధులు ఇస్తానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో పంచాయతీలకు ఒక్క రుపాయి కూడా ఇవ్వలేదని, ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ పథకాలను అమలు చేస్తూ తాము చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

