ఆడియో క్లిప్లో తప్పుగా ఏం మాట్లాడలేదు

ఆడియో క్లిప్లో తప్పుగా ఏం మాట్లాడలేదు

చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వవద్దంటూ తాను మాట్లాడిన ఆడియో వైరల్ కావడంపై కాంగ్రెస్ నేత పాల్వాయ్ స్రవంతి స్పందించారు. ఆడియో విషయం కొద్దిసేపటి క్రితమే తెలిసిందని అన్నారు. అందులో తానేమీ తప్పుగా మాట్లాడలేదని స్రవంతి స్పష్టం చేశారు. 

కోళ్లను కమ్మినట్లు కమ్మే కుట్ర చేస్తున్నారని స్రవంతి ఆరోపించారు. ఆడియో క్లిప్ లీకేజీ వెనుక ఇతర పార్టీల నేతలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనది కాంగ్రెస్ రక్తమన్న ఆమె.. మూడుసార్లు టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారలేదని అన్నారు. కొందరు టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని పని గట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని స్రవంతి మండిపడ్డారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే టికెట్ ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.