
న్యూఢిల్లీ: కస్టమర్లు క్యాష్ వాడి ఎంత గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు. కానీ, గోల్డ్ అమ్మేవారు మాత్రం సింగిల్ ట్రాన్సాక్షన్‌లో రూ. 2 లక్షల కంటే ఎక్కువ అంగీకరించకూడదు. ఒకవేళ ఈ రూల్ ఫాలో కాకపోతే ఎంత అమౌంట్ తీసుకున్నారో అంతే అమౌంట్‌ను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పెనాల్టీగా వేస్తుంది. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ బల్వంత్ జైన్ పేర్కొన్నారు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ పెట్టి గోల్డ్ కొన్నవారు ఆన్‌లైన్ లేదా క్యాష్ రూపంలో పేమెంట్ చేసినా పాన్, ఆధార్ వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌లను సెల్లర్‌కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.