కామారెడ్డి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్

కామారెడ్డి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఫైనల్
  • నోటిఫికేషనే తరువాయి 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 532 పంచాయతీలు, 4,656 వార్డులకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బీసీ గణన ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.  ఏ పంచాయతీ ఏవరికి రిజర్వు కానుందనేది ఇప్పటికే అధికారులు ఫైనల్ చేశారు. ఆదివారం  50 శాతం మహిళలకు సంబంధించి రిజర్వేషన్లను నాయకుల సమక్షంలో  డ్రా తీశారు.  కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో ఆర్డీవోల సమక్షంలో ఆయా డివిజన్ల సర్పంచ్​లకు మహిళలకు కేటాయించే వాటిని డ్రా తీశారు.

 సర్పంచ్​ రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఫైనల్​ చేశారు.  ఆయా గ్రామాల రిజర్వేషన్లు ఫైనల్ అయినప్పటికీ అధికారులు మాత్రం అధికారికంగా వెల్లడించట్లేదు. జిల్లాలో 532 పంచాయతీల్లో ఎస్సీలకు 79, ఎస్టీలకు  91 రిజర్వు కానున్నాయి.    కలెక్టర్ ఫైనల్​ చేసి పంచాయతీ రాజ్ కమిషనర్​కు పంపనున్నారు. ప్రభుత్వం గెజిట్ ఇచ్చి ఎన్నికల కమిషన్​కు వివరాలు పంపనుంది. ఆ తర్వాత షెడ్యూల్​ విడుదల అవుతుంది.   ఫైనల్​ ఓటర్​ లిస్టును కూడా ప్రకటించారు.  పల్లెల్లో పంచాయతీ ఎన్నికల పోరు కు సంబంధించి వాతవరణం వేడెక్కుతోంది.