లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయితీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయితీ కార్యదర్శి

కామారెడ్డి  జిల్లాలో  లంచం తీసుకుంటున్న పంచాయితీ  కార్యదర్శిని  రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు  ఏసీబీ అధికారులు.  దోమకొండ మండలం  ముత్యంపేట  గ్రామానికి చెందిన  భూదేవి  అనే మహిళ  నుంచి  7 వేలు లంచం  తీసుకుంటుండగా  అధికారులు పట్టుకున్నారు. భర్త చనిపోవడంతో  వితంతు  ఫించన్ తో పాటు  ఇంటి నిర్మాణం అనుమతి  కోసం  పంచాయితీ కార్యదర్శిని దరఖాస్తు  కోరింది శ్రీదేవి.  దీంతో పంచాయితీ  కార్యదర్శి 20 వేల  లంచాన్ని డిమాండ్  చేశాడు. అయితే  శ్రీదేవి తండ్రి రాజయ్య  7 వేల రూపాయలు  ఇస్తానని  ఒప్పించాడు.  తర్వాత రాజయ్య  ACB అధికారులను  ఆశ్రయించాడు. దీంతో  పంచాయితీ కార్యదర్శి  లంచం  తీసుకుంటుండగా ఏసీబీ  అధికారులు  రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తల కోసం :-

నాటో తూర్పుకొస్తే.. మిలటరీ దింపుతం


సౌత్​ కొరియాలో బైడెన్​ టూర్