ఈ బ్రాండ్ క్వార్టర్ తాగుతున్నారా ? నకిలీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. పంచాయతీ సెక్రెటరీ నయా దందా

ఈ బ్రాండ్ క్వార్టర్ తాగుతున్నారా ? నకిలీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. పంచాయతీ సెక్రెటరీ నయా దందా

తెలంగాణ రాష్ట్రంలో స్టాక్ మిగలకుండా ఎప్పటికప్పుడు అమ్ముడయ్యే సరుకు ఏదైనా ఉందా అంటే అది మద్యం మాత్రమే. ఎంత కష్టపడతారో అంత చిల్ అవుతుంటారు. మందుకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భలే క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఒక ప్రముఖ బ్రాండ్ పేరున నకిలీ మద్యం తయారు చేసి వేల కొద్ది క్వార్టర్ సీసాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. శనివారం (ఆగస్టు 23) నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 

మహబూబాబాద్ పట్టణం లో నకిలీ మద్యం తయారు చేస్తున్న 5  గురు ముఠా సభ్యులను అరెస్టు చేయగా.. విషయం తెలిసీ మరో ఇద్దరు పరారయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగీ, పంచాయతీ సెక్రెటరీ ఈ ముఠాను నడిపిస్తుండటం. భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పంచాయతీ సెక్రటరీ గా పని చేస్తున్న గోపాల కృష్ణ ఈ ముఠాలో కీలక సభ్యునిగా ఉన్నాడు. 

సొంతంగా లేబుల్స్ తయారు చేసీ.. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4  లక్షల రూపాయల విలువ చేసే 2 వేల6 వందల 88 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు , 2 కార్లు సీజ్ చేశారు. వీటితో పాటు 4 వేల 500 ఖాళీ సీసాలు , 1755 లేబుల్స్ , 2000 వేల మూతలు, 60 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నకిలీ మద్యం పై ఇంకా ఎంత మంది వున్నారాని  ఆరా తీస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు. పరారీలో వున్న వారి కోసం గాలింపు చర్యలు చేప్పట్టినట్లు చెప్పారు. మిగిలిన వారిని త్వరలోఅరెస్టు చేస్తామని అన్నారు.