ఆకాశంలో అద్భుతం అవిష్కృతం

ఆకాశంలో అద్భుతం అవిష్కృతం

ఆకాశంలో అద్భుతం అవిష్కృతం అయింది. ఐదు గ్రహలు ఒకే రోజున దర్శనం ఇచ్చాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే వరసలో దర్శనం ఇచ్చాయి. వీటికి అదనంగా చంద్రుడు కనిపించాడు.  50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహలు కనిపించాయి. 

ఇందులో  శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి గ్రహాలను మనం మాములుగా కంటితో చూడవచ్చు.. కానీ బుధుడు, యురేనస్ గ్రహాలను పవర్ ఫుల్ బైనాక్యులర్స్ సహాయంతో మాత్రమే చూడగలం. అయితే అన్ని ప్రాంతాల్లో ఇది కనిపించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.  గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఒక వరుసలో ఏర్పడడంతో ఇటువంటి అరుదైన దృశ్యం చూసే అవకాశం లభించింది.

అయితే ఇలాంటి అద్భుతమైన అవిష్కృతాన్ని 2040 వరకూ చూడలేమని  శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించడం వల్ల మంచిదేనని జోతిష్య పండితులు అంటున్నారు. ఈ సమయంలో పుట్టినవారు అదృష్టవంతులని చెబుతున్నారు. వీటిని ఎవరైనా చూడవచ్చునని దోషాలు ఏమీ కలగవని అంటున్నారు.