పంజా వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ రిలీజ్ డేట్ అనౌన్స్

పంజా వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ రిలీజ్ డేట్ అనౌన్స్

ఉప్పెన, రంగరంగా వైభవంగా, కొండపొలం చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్స్‌‌తో ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్(VaishnavTej). ఇప్పుడు ఆదికేశవ(Aadikeshava) అనే యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌తో  ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.  శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్నఈ మూవీని  శ్రీకాంత్ ఎన్.రెడ్డి(SrikanthNReddy) డైరెక్ట్ చేస్తున్నారు. 

లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఒక రొమాంటిక్ ఫోటో పోస్ట్ చేసి..రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆదికేశవ మూవీ 2023 నవంబర్ 10వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ లో పేర్కోంటూ..కొన్నికథలు నిరీక్షణతో ఉన్నా..విలువైన సమయానికి ముందుకు వస్తాయి..అంటూ వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చే ట్యాగ్ తో..రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 

ఇక రీసెంట్ గా రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ లో మైనింగ్ ఏరియాలో ఉన్న గుడిని కూల్చడం నేపథ్యంలో రావడంతో.. నెటిజన్స్ గాలి జనార్ధన్ రెడ్డిని ఈ టీజర్ కు లింక్ చేస్తున్నారు. మరి నిజంగానే ఈ సినిమా గాలి జనార్ధన్ రెడ్డి కథతో రానుందా? లేదా? అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆదికేశవ మూవీలో రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్ కనిపించనున్నారు. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్(gvprakashkumar) మ్యూజిక్ అందిస్తున్నారు.