
స్కూల్ ప్రిన్సిపాల్ తమ కొడుకును కొట్టిండని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రలు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ హుజురాబాద్ మండలంలో జరిగింది. తుమ్మనపల్లిలోని ఏకశీలా స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న సాయిసిద్ధాంత్ ను ప్రిన్సిపాల్ రక్తం వచ్చేలా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. టీచర్ లేనప్పుడు అల్లరి చేస్తుండనే కారణంతో తమ కొడుకుతో పాటు మరి కొంత మంది స్టూడెంట్స్ ను చితకబాదిండని ఫిర్యాదులో తెలిపారు. ఎందుకు కొట్టారని అడిగితే ప్రిన్సిపాల్ ఏం చేస్తారో చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.