ఘనంగా ఈఫిల్ టవర్ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా ఈఫిల్ టవర్ వార్షికోత్సవ వేడుకలు

ఈఫిల్ టవర్ నిర్మించి 130 ఏళ్లు నిండడంతో ఏర్పాటు చేసిన లేజర్ షో పర్యాటకులను ఆకట్టుకుంది. 1889లో ఈఫిల్ టవర్ ను నిర్మించారు. ఏటా ఈ టవర్ ను దాదాపు 70 లక్షల మంది దాకా సందర్శిస్తారు. వరల్డ్ ఎగ్జిబిషన్ కోసం ఈ టవర్ ను నిర్మించారు. ఆ తర్వాత దీన్ని కూల్చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే రోజురోజుకూ టూరిస్టుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పారిస్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో ఈఫిల్ టవర్ టాప్ టూరిజం స్పాట్ గా ఉంటోంది.