పర్ణశాల రామయ్య హుండీ ఆదాయం రూ.17.19 లక్షలు

పర్ణశాల రామయ్య హుండీ ఆదాయం రూ.17.19 లక్షలు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి అనుబంధ ఆలయం దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని రామాలయం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది141 రోజుల తర్వాత హుండీలను తెరిచారు. రూ.17,19,292 ఆదాయంతో పాటు మూడు మలేషియా రింగిట్స్ వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. 

పెద్దమ్మ తల్లి హుండీ లెక్కింపు 

పాల్వంచ రూరల్ : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాధపురంలోని పెద్దమ్మ తల్లి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు.  ఆలయ ఈవో సుదర్శన్ పాల్వంచ రూరల్ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులు మూడు నెలల నుంచి వేసిన కానుకలను లెక్కించగా రూ. 28,01, 520 ఆదాయం సమకూరింది. యూఎస్ఏ కరెన్సీ 5 డాలర్ల నోట్లు రెండువచ్చినట్టు ఈవో తెలిపారు. హుండీలో భక్తులు వేసిన మిశ్రమ బంగారంతో పాటు వెండిని సీల్​ చేసి హుండీలో వేసినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ తో పాటు బ్యాంకు సిబ్బంది వివిధ సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.