జంతువుల అక్రమ రవాణా గుట్టురట్టు

జంతువుల అక్రమ రవాణా గుట్టురట్టు

బ్యాంకాక్ నుంచి చెన్నైకు జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడిని చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఫ్లైట్ నెంబర్ TG 337లో సజీవంగా ఉన్న మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని ఆపి తనిఖీలు నిర్వహించగా..అతని వద్ద ఒక కోతి, 15 కింగ్స్ పాములు, ఐదు కొండ చిలువలు, రెండు తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

బ్యాంకాక్ నుంచి జంతువుల రవాణా చట్టవిరుద్దమని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం యానిమల్స్ క్వారంటైన్ & సర్టిఫికేషన్ సర్వీసెస్ తో సంప్రదించిన తర్వాత మూగజీవాలను థాయ్ ఎయిర్‌వేస్ ద్వారా తిరిగి స్వదేశానికి పంపించామని అధికారులు తెలిపారు.

ఏమేమి ఉన్నాయంటే..
ప్రయాణికుడి వద్ద డి బ్రజ్జా జాతికి చెందిన కోతి ఉంది. ఇది ఆఫ్రికాకు చెందిన మంకీ. వీటికి ఫ్రాంకో -ఇటాలియన్ అన్వేషకుడు పియరీ సావోర్గ్నన్ .. డి బ్రజ్జాగా నామకరణం చేశాడు. వీటితో పాటు కింగ్స్ స్నేక్స్ ఆగ్నేయ కెనడా నుంచి ఈక్వెడార్ వరకు కనిపిస్తాయి. ఇవి విషరహితమైనవి. ఈ పాములు చిన్న క్షీరదాలు, పక్షులు, బల్లులు, ఉభయచరాలను ఆహారంగ స్వీకరిస్తాయి. బాల్ కొండచిలువలు అత్యంత ప్రజాదరణ పొందిన పాము జాతికి చెందినవి. వీటిపై మానవుల వేలిముద్రల నమూనాను కలిగి ఉంటుంది. ఆల్డబ్రా తాబేళ్లు ప్రపంచంలోని అతిపెద్ద భూ తాబేళ్లలో ఒకటిగా పేరుగాంచినవి. ఇవి 250 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అంతేకాకుండా 150 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇవి ఎక్కువగా హిందూ మహాసముద్రంలోని అల్డబ్రా ద్వీపంలో  కనిపిస్తాయి.