మాస్కు కట్టుకోలేదని ఫ్లైట్‌లో నుంచి దింపేశారు!!

మాస్కు కట్టుకోలేదని ఫ్లైట్‌లో నుంచి దింపేశారు!!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రొఫెషనల్స్‌తోపాటు ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినా కొందరు ఏమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యంగా మాస్కులు కట్టుకోకుండా నిబంధలకు తూట్లు పొడుస్తూ తమతోపాటు మిగతా వారినీ ప్రమాదంలోకి నెడుతున్నారు. ఈ నేపథ్యంలో మాస్కు కట్టుకోవడానికి తిరస్కరించిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతోంది. మాస్క్ కట్టుకోవడానికి నిరాకరించినందుకు సదరు మహిళను విమానయాన సిబ్బంది ఎయిర్‌‌క్రాఫ్ట్‌ నుంచి దింపేశారు. ఈ ఘటన అమెరికన్ ఎయిర్‌‌ ఫ్లైట్‌లో జరిగింది. ఈ ఫ్లైట్ జూలై 19న ఓహియో నుంచి కరోలినాకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం.

View this post on Instagram

It’s alllll about that law and order…well….up until it comes to the part where you need to wear a mask. A . MASK. ? It’s the least you can do to be nice to your fellow humans. ?Remember the shoe bomber dude and how we all had to start removing our shoes in security…and we all lived…and it didn’t kill anyone to adapt? Yeah, that. ??‍♀️Anyway – enjoy the drive, ma’am! ???? (NOTE: If there is a medical reason for not wearing a mask you produce the paperwork from your physician at the gate, which doesn’t seem to be the issue here.) P.S. Because I know it will be every other comment — I have no clue how she got all those bags of bullshit on the plane! ?✈️?? • • • #passengershaming #instagramaviation #comeflywithme #airlinelife #airplaneetiquette #frequentflyer #crewlife #plane #aviation #cabincrew #avgeek #cabincrewlife #flightattendant #flightattendantlife #stewardess #flightattendantproblems #travel #flightattendants #instapassport #aviationgeek #FAlife #airtravel #travelgram #traveltips #pilotlife #frequentflier #covid19 #coronavirus #mask #wearamask

A post shared by Passenger Shaming (@passengershaming) on

ఈ వీడియోను ప్యాసెంజర్ షేమింగ్ అనే అకౌంట్‌లో జోర్డాన్ స్లేడ్ అనే ప్రయాణికుడు పోస్ట్ చేశాడు. ఫ్లైట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఫేస్ కవర్ చేసే మాస్క్ కట్టుకోకపోవడంతో సదరు మహిళా ప్రయాణికురాలిని విమానంలో నుంచి దింపేశారు. ఈ వీడియోలో సదరు మహిళ ఆవేశంతో తన వస్తువులను తీసుకొని బయటకు వెళ్లింది. ఆమె ముఖంపై ఎలాంటి మాస్కూ లేదు. ఆమె వెళ్తున్న టైమ్‌లో విమానంలోని సిబ్బంది చప్పట్లు కొట్టడం గమనార్హం. మాస్కు ఎందుకు కట్టుకోలేదని సదరు మహిళను ప్రశ్నిస్తే తన మెడికల్ కండీషన్ బాగుందని ఆమె జవాబిచ్చినట్లు తెలిసింది.