Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆస్ట్రేలియా టీమ్ షెడ్యూల్ రాబోయే రోజుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఆగస్ట్ 2026 నుంచి కేవలం 11 నెలల వ్యవధిలోనే ఆస్ట్రేలియా ఏకంగా 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతోంది. దీంతో పాటు వన్డే వరల్డ్ కప్, ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్ కూడా ఉన్నాయి. ఈ సుదీర్ఘమైన అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కమిన్స్ ఐపీఎల్‌కు బ్రేక్ ఇచ్చే యోచనలో కనిపిస్తున్నాడు.
కమిన్స్ ఓపెన్ టాక్:
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కమిన్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాకి వెళ్లిపోయాడు. ఐపీఎల్ నెక్స్ట్ సీజన్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వచ్చే ఏడాది నా షెడ్యూల్ చూస్తే.. ఏదో ఒక దాన్ని కచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది.. కానీ నేను టెస్ట్ మ్యాచ్‌లను లేదా వన్డే వరల్డ్ కప్‌ను అస్సలు వదులుకోలేను.. ఐపీఎల్లో ఆడాలా వద్దా అనే విషయంపై ఫ్రాంచైజీతో (SRH) మాట్లాడి, సమయం వచ్చినప్పుడు తుది నిర్ణయం తీసుకుంటాను.. ప్రస్తుతం నాకున్న చిన్న చిన్న గాయాల వల్ల దేనికీ ఇప్పుడే లాక్ అయిపోవాలని అనుకోవడం లేదని ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
ఇండియా సిరీస్ తర్వాత బ్రేక్:
ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్.. రాబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్ గురించి కూడా మాట్లాడుతూ.. నేను ఇండియా సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే.. ఆ తర్వాత జరగబోయే కఠినమైన యాషెస్ (Ashes) సిరీస్ కంటే ముందు నాకు ఖచ్చితంగా కొంత బ్రేక్ అవసరమని కమిన్స్ స్పష్టం చేశాడు. అలాగే తనతో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ లాంటి సీనియర్ బౌలర్ల వర్క్‌లోడ్‌ను కూడా మేనేజ్ చేయాల్సి ఉంటుంది, అవసరమైతే ఇండియా సిరీస్ చివర్లో కొందరికి రెస్ట్ ఇస్తామని పేర్కొన్నాడు.
కమిన్స్ బిజీ షెడ్యూల్ ఇదే:
* ఆగస్ట్ 2026: బంగ్లాదేశ్‌తో హోమ్ సిరీస్.
* డిసెంబర్ - జనవరి: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.
* జనవరి - ఫిబ్రవరి: ఇండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్.
* ఆ తర్వాత: సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్‌తో 150వ యానివర్సరీ టెస్ట్ మ్యాచ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్ కప్.
