మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో కీలక పదవి.. ప్రవాస భారతీయుడికే

మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో కీలక పదవి.. ప్రవాస భారతీయుడికే

ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో మరో కీలక పదవి బాధ్యతలు ప్రవాస భారతీయుడు చేపట్టాడు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌, సర్ఫేస్‌ విభాగాలకు కొత్త చీఫ్‌గా ఐఐటీ మద్రాస్‌కు చెందిన పవన్‌ దావులూరి నియామకమయ్యారు. పవన్ యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ మేరిల్యాండ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసాడు. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అప్పటి నుంచి జనరల్‌ మేనేజర్‌, విండోస్‌ ప్లస్‌ డివైజెస్‌ టీమ్‌కి కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చాడు. దాదాపు మూడేళ్లుగా ఆయ‌న కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. 

అయితే ఈ పదవిలో ఉన్న ప‌న‌య్ గ‌తేడాది అమెజాన్‌లో చేరేందుకు మైక్రోసాప్ట్ విండోస్ చీఫ్‌ పదవి నుంచి వైదొలిగారు.  అప్పటి పోస్టు ఖాళీగా ఉంటూ వస్తున్నది.  తాజాగా పవన్‌ దావులూరిని నియమించింది. పవన్‌ దాదాపు 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో సేవలందిస్తూ వచ్చారు. మైక్రోసాఫ్ట్‌  విండోస్‌, స‌ర్ఫేస్ విభాగాల‌కు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్‌కే కట్టబెట్టింది. పవన్‌ నియామకమంతో అమెరికా టెక్‌ కంపెనీల్లో అత్యన్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు సైతం చోటు దక్కింది.