పవన్‎ పై పోసాని తీవ్ర వ్యాఖ్యలు

V6 Velugu Posted on Sep 28, 2021

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రచయిత పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ ఓ సైకో అని.. ఆయన ఫ్యాన్ కూడా సైకోలని ఆయన అన్నారు. తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎవరినైనా ఏదైనా అనొచ్చు కానీ, తనని ఎవరూ ఏదీ అనకూడదని భావించే ఓ సైకో పవన్ కళ్యాణ్ అని పోసాని అన్నారు. పవన్ కళ్యాణ్ తన అభిమానులతో మా ఇంట్లో ఆడవాళ్లను కించపరిచేవిధంగా మాట్లాడిపిస్తున్నారని పోసాని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన ఓ నాయకుడు.. తన అభిమానులను కంట్రోల్‎లో పెట్టుకోలేడా అని పోసాని ప్రశ్నించాడు.

పవన్ కళ్యాణ్ తీరుమీద పోసాని సోమవారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దాంతో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మెసెజ్‎లు, ఫోన్లతో తనను టార్చర్ పెడుతున్నారని ఆయన అన్నారు. అసభ్యకర మెసెజ్‎లతో నా కుటుంబసభ్యులు ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా నన్ను నిరుత్సాహపరచాలని చూస్తే.. తాను ఏ మాత్రం వెనక్కు తగ్గనని ఆయన అన్నారు. నా ఇంట్లో వాళ్లను తిడితే.. నేను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్లను తిడతాను అని పోసాని అన్నారు.

కాగా.. పోసాని వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు ప్రెస్ క్లబ్ వద్దకు భారీగా చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. జనసేన కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోసానిని పోలీసుల భద్రతతో ఆయన ఇంటికి  తరలించారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా పోసాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రెస్ క్లబ్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. సైకో పవన్ కాదు.. పోసానే సైకో అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖబర్దార్ పోసాని.. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలం అంటూ హెచ్చరించారు.

For More News..

హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే

దారుణం.. అత్త వేధింపులకు అల్లుడు బలి

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

కోచింగ్ లేకుండా ఐపీఎస్ నెగ్గిన 22 ఏళ్ల కుర్రాడు

Tagged Hyderabad, Movies, Pawan kalyan, janasena, tollywood, pawan kalyan fans, Posani Krishna Murali

Latest Videos

Subscribe Now

More News