దారుణం.. అత్త వేధింపులకు అల్లుడు బలి

V6 Velugu Posted on Sep 28, 2021

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, అత్త వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఉదయ్ భాస్కర్ (45) కొంతకాలం కిందట మదనపల్లెకు వచ్చి శేషమహల్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. ఆయనకు అదే ప్రాంతానికి చెందిన సోనితో ఆరేండ్ల కింద పెళ్లైంది. వీరి బంధానికి గుర్తుగా వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. అయితే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మేనేజర్‎గా పనిచేస్తున్న ఉదయ్ భాస్కర్.. తాగుడుకు అలవాటుపడటంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. దాంతో సోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది అవమానంగా భావించిన భాస్కర్.. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఫేస్‎బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, అత్త, మరదల్లు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు భాస్కర్ ఫేస్‎బుక్ లైవ్‎లో చెప్పాడు. ఈ వీడియో చూసిన భాస్కర్ స్నేహితులు.. అతని భార్యకు మరియు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారందరూ భాస్కర్ ఇంటికి చేరుకునేసరికే మృతిచెందాడు. భర్త తాగొచ్చి గొడవపడేవాడని.. పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసినట్లు భాస్కర్ భార్య సోని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


For More News..

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

కోచింగ్ లేకుండా ఐపీఎస్ నెగ్గిన 22 ఏళ్ల కుర్రాడు

దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..

 

Tagged chittoor, andhrapradesh, harassment, Madanapalle, suicide, facebook live, son in law suicide

Latest Videos

Subscribe Now

More News