"బ్రో" కాంబో అదిరింది.. కానీ ఆ షూస్ ఏంటన్నా అలా ఉన్నాయి?

"బ్రో" కాంబో అదిరింది.. కానీ ఆ షూస్ ఏంటన్నా అలా ఉన్నాయి?

మెగా హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ మార్కండేయులు(మార్క్)గా కనిపించనున్నాడు. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రీలీజైనా పవన్, సాయి తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

 ఇక తాజాగా పవన్-సాయి తేజ్ కలిసున్న కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మెగా అభిమానులకి ఫుల్ కిక్ ఇస్తోంది. పవన్ ఒక స్టైలిష్ బైక్ పైన ఒక కాలు పెట్టి నిలబడగా, వెనుక చేతులు కట్టుకోని సాయి ధరమ్ తేజ్ నిలబడి ఉన్నారు. ఈ కొత్త పోస్టర్ చాలా ఇంప్రెసీవ్ గా ఉంది. అంతేకాదు ఈ పోస్టర్ లో పవన్ వేసుకున్న షూస్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ షూస్ ఏంటన్నా అలా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 ఇక బ్రో సినిమా జులై 28న థియేటర్స్ లోకి రానుంది. మరి మెగా మామ అల్లుళ్ళ కాంబో వర్కౌట్ అయితే.. థియేటర్స్ లో మెగా ఫాన్స్ రచ్చ మాములుగా ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.