కాన్వాయ్ ఆపి.. రోడ్డు పక్కన కుర్చీ వేసుకుని.. జనం సమస్యలు విన్న పవన్ కల్యాణ్

కాన్వాయ్ ఆపి.. రోడ్డు పక్కన కుర్చీ వేసుకుని.. జనం సమస్యలు విన్న పవన్ కల్యాణ్

ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తోలి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ సెషన్స్ లో మొదటి రోజు ప్రొటెం స్పీకర్ గా ఎన్నిక కాబడ్డ టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత మరో టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఎన్నుకుంది సభ. రెండో రోజు స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నను సభ్యులంతా అభినందిస్తూ తమ తొలి ప్రసంగాన్ని ఇవ్వటంతో సభ ముగిసింది. అసెంబ్లీ సెషన్స్ ముగిసాక ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెషన్స్ ముగించుకొని అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే, అక్కడికక్కడే కాన్వాయి ఆపేసి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి వారి గోడు విన్న పవన్ కళ్యాణ్, బాధితుల నుండి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.